calender_icon.png 19 April, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_12209362.webp
క్యాన్సర్ అంటే భయం వద్దు

17-04-2025

సిద్దిపేట, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్సలు అందించి పూర్తిగా నయం చేయవచ్చునని సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు అన్నారు. ఈ నెల 19నాడు సిద్దిపేటలోని విపంచి కళ భవనంలో కిమ్స్ ఆస్పత్రి ఆంకాలజిస్ట్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్యులు డాక్టర్ మధు, డాక్టర్ శ్రవణ్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాంలు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. మాజీమం త్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో సిద్దిపేటలో కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.

article_22421538.webp
మహిళ హక్కుల పరిరక్షణ యాత్రని విజయవంతం చేయాలి

17-04-2025

సిద్దిపేట, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): జ్యోతిరావు పూలే, అంబేద్కర్ యాదిలో జరిగే మహిళా హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న బస్సు యాత్రను జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి అత్తిని శారద కోరారు. బుధవారం జరిగిన ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో శారద మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఐద్వ ఆధ్వర్యంలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర సాగుతుందన్నారు. యాత్ర సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 18న చేరుకుంటుందని, 19న పాత బస్టాండ్ వద్ద పూలే, అంబేద్కర్ మహనీయులకు నివాళులర్పించి సభ నిర్వహించడం జరుగుతుందన్నారు.