Districts - Bhadradri Kothagude

అక్టోబర్‌లోగా యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల
అక్టోబర్‌లోగా యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

ములకలపల్లి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలను అందించి రైతులకు సాగునీటి భరోసా కల్పించేందుకు పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ,భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి పరిశీలించారు.ములకలపల్లి మండలం కుమ్మరిపాడు గ్రామంలో ఎస్‌టీఎస్‌డీఎఫ్ నిధులతో రూ.4కోట్ల 63 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి, బీటీ రోడ్డును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.

22-09-2026 | 10:57am

మానవత్వం చాటుకున్న సంక్షేమ అధికారి
మానవత్వం చాటుకున్న సంక్షేమ అధికారి

భద్రాద్రి కొత్తగూడెం:ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా చూడటమే బాధ్యతగా భావించి సంక్షేమ అధికారి లెనినా మానవత్వం చాటుకున్నారు. ఇల్లంద మండలం రాగబోయినగూడెంకు చెందిన ఈసం కన్నమ్మ కుటుంబంలో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. పిల్లలతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చిన కన్నమ్మ తమ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సంక్షేమ అధికారి లెనినా వారిని తన ఛాంబర్‌కు పిలిపించి రెండు టాయిలెట్‌ సైకిళ్లు అందజేశారు. త్వరలో వీల్‌చైర్లు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కన్నమ్మ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.

22-09-2026 | 10:38am