ఉన్నత పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం
24-01-2025
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 1వ తేదీ నుండి జనవరి 31 తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం 2025 లో భాగంగా శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత గురించి జిల్లా రవాణా శాఖ అధికారి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ మొహమ్మద్ సమ్ధాని, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందర్లాల్ పాఠశాల విద్యార్థులతో సమావేశమై మన దేశంలో మోటారు వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు నానాటికి అధికమవుతున్నాయని, ఈ నవ నాగరిక ఆధునిక వేగవంతమైన సమాజము, కంప్యూటర్ యుగంలో ప్రతి వ్యక్తికి మోటార్ వాహనం అవసరం అయినది.