ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు
11-12-2025
హాజీపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మండలంలో 12 జీపీలకు 39 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీపడ్డారు. మండలంలో 16,954(పురుషులు 8,361, మహిళలు 8,593) మంది ఓటర్లుండగా ఉదయం తొమ్మిది గంటల వరకు 3,176 (19%), 11 గంటల వరకు 9,167 (54%), ఒంటి గంట వరకు 14,371 (84.76%), ఒంటి గంట అనంతరం క్యూలో నిలబడిన వారు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం పోలింగ్ 14,420 (85.05%)కి చేరుకుంది. మండల వ్యాప్తంగా ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో 7,057 (84.40%) పురుషులుండగా, 7363 (85.69%) మహిళలు ఉన్నారు.