మనోహరాబాద్ మండలంలోని సర్పంచ్ ఎన్నికల ఫలితాలు
14-12-2025
మనోహరాబాద్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా మనోహరబాద్ మండల పరిధి రెండవ విడత స్థానిక సర్పంచి ఎన్నికల సమరంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా లింగారెడ్డిపేట్ కాంగ్రెస్ అభ్యర్థి పెంటగౌడ్ అత్యధికంగా 500 పైచిలుకు మెజారిటీతో సమీప ప్రత్యర్థి పిట్ల బాలేష్, సురేష్ గౌడ్ లపై ఆధిక్యం సాధించారు. ఇంతే కాకుండా కూచారం కాంగ్రెస్, వెంకటాపూర్ అగ్రహారం కాంగ్రెస్, కోనాయిపల్లి కాంగ్రెస్, కొండాపూర్ కాంగ్రెస్, పోతారం కాంగ్రెస్, రంగయ్పల్లి కాంగ్రెస్, ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీ కాలాకల్ కాంగ్రెస్ కైవసం చేసుకోగా జీడిపల్లి మనోహరాబాద్ బిజెపి మద్దతుతో అభ్యర్థులు గెలవడం జరిగింది.