ఆయువుపట్టు మైనింగ్
21-01-2025
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): దేశ ఆర్థిక వృద్ధికి మైనింగ్ రంగం ఆయువుపట్టు అని, ఈ రంగం లేకుండా దేశ ఆర్థిక కార్యకలాపాలు దాదాపు అసాధ్యమని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 72 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతున్నదని వెల్లడించారు. ఒడిశాలోని కోణార్క్లో రా ష్ట్రాల బొగ్గు, గనుల శాఖ మంత్రులతో సోమవా రం నిర్వహించిన 3వ జాతీయ సదస్సులో ఆ యన మాట్లాడారు.