ఎన్నికల సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
14-12-2025
నారాయణపేట (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా పరిధిలో జరుగుతున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాలలో ఎన్నికల పోలింగ్ సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్త్ ఏర్పాట్లను ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సమస్యత్మక పోలింగ్ కేంద్రాలైన జాజాపూర్, అప్పక్పల్లి, కోటకొండ, కొండాపూర్, కిష్టాపూర్, గోటూర్, మరికల్, ధన్వాడ తదితర పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించి పోలింగ్ సరళి, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణం సర్పంచ్ ఎన్నికలు కొనసాగేలా చూడాలని తెలిపారు.