కొనుగోలు వేగంగా జరగాలి
20-11-2025
మెట్ పల్లి (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. గురువారం మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, రాఘవపేట్ మరియు ఓబులాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి సమగ్రంగా పరిశీలిచారు.ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహణ, సౌకర్యాలు మరియు ధాన్యం వాహనాల రాకపోకలను పరిశీలించి, ట్రక్షీట్లలో నమోదైన ధాన్యం వివరాలను తనిఖీ చేసి, గత సారి వచ్చిన వడ్లతో పోల్చి ప్రస్తుత సీజన్ రికార్డులను విశ్లేషించారు. అలాగే రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.