calender_icon.png 30 January, 2026 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_59826792.webp
అభ్యర్థులు కావలెను!

30-01-2026

మేడ్చల్, జనవరి 29 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థుల కొరతను ఎదు ర్కొంటున్నాయి. బి ఫారం ఇస్తామన్నా మూడు మున్సిపాలిటీలలో అభ్యర్థులు పోటీకి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ బిజెపి ఇతర పార్టీలకు కొన్ని వార్డులలో అభ్యర్థులు దొరకడం లేదు. జనరల్ వార్డులలో పలువురు టికెట్లు ఆశిస్తున్నప్పటికీ రిజర్వుడు వార్డులలో ఎవరో ఒకరిని బలవంతంగా పోటీకి నిలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థి లేని చోట ఇతర పార్టీల నుంచి పార్టీలో చేర్చుకొని టికెట్లు ప్రకటిస్తున్నారు. ఇతర పార్టీల కంటే అధికార పార్టీ టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉండాలి.

article_90023092.webp
ఘట్టుమైసమ్మ జాతర హుండీ రూ. 1లక్ష 77వేల 581

28-01-2026

ఘట్ కేసర్, జనవరి 28 (విజయక్రాంతి) : ఘట్టుమైసమ్మ జాతర హుండీ డబ్బులను ఆలయ ఆవరణలో లెక్కించారు. ఈనెల 25న ఆదివారం జరిగిన అమ్మవారి జాతరలో భక్తులు సమర్పించుకున్న హుండీల ఆదాయం రూ. 1లక్షల 77 వేల 581 వచ్చినట్లు దేవాదాయ ఇన్ స్పెక్టర్ ప్రణీత్ కుమార్, ఆలయ కార్యనిర్వాహన అధికారి ఎల్. భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాల నాయకులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీలను తెరచి డబ్బులను లెక్కించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి, ప్రసాద్, బొక్క సత్తిరెడ్డి, ఎం. శ్రీనివాస్, నూతన కమిటీ డైరెక్టర్లు, కుల సంఘాల నాయకులు , దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

article_58161665.webp
నేటి నుంచి శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

28-01-2026

ఘట్ కేసర్, జనవరి 28 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్ ఎదులాబాద్ లోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో ఈనెల 28 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు అంబారిపేట అప్పలాచార్యులు, మురళీకృష్ణ, వరదరాజులు తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు తొలక్కం, దివ్య ప్రబంధ పారాయణం, ద్రావిడ వేదపారాయణం, 29న ఉదయం సేవాకాలము, ప్రబోధకి ఆరగింపు, సాయంత్రం 5 గంటలకు దివ్య ప్రబంధ పారాయణము, 30న సాయంత్రం 6 గంటలకు వైకుంఠోత్సవము, 31న ఉదయం 10 గంటలకు స్వామి వారి గ్రామ సేవ, 11 గంటలకు శ్రీస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవము, ఫిబ్రవరి 1న సాయంత్రం 6 గంటలకు శ్రీస్వామి వారి విమాన రథోత్సవము, 2న ఉదయం చక్రతీర్థ స్నానము, అరగింపు, తీర్థ ప్రసాదగోష్టి తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బ్రహ్మోత్సవాలతో పాల్గొనా లని ధర్మకర్తలు కోరారు.