ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
09-01-2026
నారాయణఖేడ్, జనవరి 8: మనూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని హెచ్చరించారు. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆస్పత్రిలో మందుల స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారాయణఖేడ్, మనూరు మండలాలలోని మాయికోడ్ , నారాయణఖేడ్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొని ఉపాధ్యాయులను అభినందించి, విద్యార్థులను ప్రోత్సహించారు.