వైకుంఠధామాల్లో.. ప్రజల కష్టాలు
20-08-2025
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మద్దిరాల, తుంగతుర్తి నూతనకల్ తిరుమలగిరి నాగారం, జాజిరెడ్డిగూడెం తదితర మండలాల్లోని వైకుంఠధామాల్లో అరకొర వసతులతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. గత ప్రభుత్వం వైకుంఠధామం ఏర్పాటు చేసింది కానీ, పూర్తిస్థాయిలో వసతుల రూపకల్పన కోసం, నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం మద్దిరాల మండలంలోని కుక్కుడంలో దయానియా పరిస్థితి 10 లక్షలు పెట్టి కట్టించిన స్మశాన వాటికలో, వీధి దీపాలు లేకపోవడంతో, మృత దేహాన్ని కాల్చే సమయంలో, కుటుంబ సభ్యులందరూ తమ సెల్లుల లైట్లు పెట్టుకొని దహన సంస్కారాలు చేయడం దీనస్థితిలో మారిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి యుద్ధ ప్రాతిపది పై, ప్రతి గ్రామంలోని వైకుంఠధామాల వద్ద సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు, గ్రామ నిధులతో, లైట్లు మంజూరు చేయుటకు తక్షణమే సర్కులర్ నమోదు చేయాలని, గ్రామస్తులు కోరుతున్నారు.