ఎమ్మెల్యే జన్మదినం.. గౌరీదేవిపల్లిలో సేవా కార్యక్రమాలు
09-01-2026
రేవల్లి జనవరి 8: వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీదేవిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. అడంబరాలకు పోకుండా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విద్యా సామాగ్రిని అందించడం అభినందనీయమని ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.