రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
20-01-2025
కామారెడ్డి, జనవరి 19 (విజయక్రాంతి): రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి, నిజామాబాద్ ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.