గ్రామ శాఖ అధ్యక్షునిగా అనవేని కుమార్, ఉపాధ్యక్షునిగా తాట్లెంక కొమురయ్య
మానకొండూరు, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా అనవేని కుమార్, ఉపాధ్యక్షునిగా తాట్లెంక కొమురయ్య లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి లు పార్టీ బలోపేతానికి, గ్రామస్థాయి లో పటిష్టతకు కృషి చేయాలని వారికి సూచించారు. తమపై నమ్మకం ఉంచి తన నియామకానికి సహకరించి , పదవి బాధ్యతలు అప్పగించిన ముండలాధ్యక్షులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు నందగిరి రవీంద్ర చారి, పార్టీ శ్రేణులకు వారు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల సత్తయ్య, గ్రామ ఉపసర్పంచ్ మేకల మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏరవేణి రామాంజనేయులు, నాయకులు కూన రమేష్, తదితరులున్నారు.
మాజీ ఎంపీటీసీ సభ్యుని సస్పెండ్
మండలంలోని శ్రీనివాస నగర్ మాజీ ఎంపీటీసీ కూన శంకర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ పై అనుచిత వ్యాఖ్యలు, పార్టీ సభ్యుల మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలో భాగంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీకి అతనికి ఎలాంటి సంబంధం ఉండబోదని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
