పట్టణంలో పందులు వదిలితే చర్యలు
30-10-2026 | 03:09pm
నిర్మల్ ,అక్టోబర్ 30 ( విజయ క్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో పందుల సంచారం వల్ల వ్యాధులు ప్రబలకుండా నివారించేందుకు పందుల యజమానులు తమ పందులను పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోకి తరలించాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు(Municipal Commissioner Ravibabu) శుక్రవారం ఒక ఆదేశించారు.
పందుల సంచారాన్ని నివారించడంలో భాగంగా యజమానులు తక్షణమే వాటిని పట్టణానికి దూరంగా తరలించాలని సూచించారు. ఆదేశాలను పాటించని వారిపై తెలంగాణ పురపాలక సంఘాల చట్టం -2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పందులను తరలించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వాటికి ఎలాంటి నష్టం వాటిల్లినా పురపాలక సంఘం బాధ్యత వహించదని స్పష్టం చేశారు.