డిగ్రీ కళాశాలలో బతుకమ్మ పండుగ

08-10-2026 | 04:38pm

నిర్మల్ ,అక్టోబర్ 8 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(Government Degree College) గురువారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగులతో బతుకమ్మలను తయారుచేసి పాటలు పాడుతూ నృత్యం చేశారు. ప్రిన్సిపల్ సుధాకర్ అధ్యాపకులు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో బతుకమ్మ ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు