కాంగ్రెస్ నాయకుల నిరసన
కుబీర్,(విజయక్రాంతి): కుబీర్ మండల(Kuber Mandal) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బషీర్ ఆధ్వర్యంలో లాఠీ చార్జింగ్ నివసిస్తూ గురువారం నిరసన(protest) తెలిపారు. నిన్న ఢిల్లీలో భారత ఎన్నికల సంఘానికి జవాబుదారితనం కోరుతూ జంతర్ మంతర్ వైపు వెళుతుండగా బల ప్రయోగం ప్రయోగించి వారిపై దౌర్జన్యంగా లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది లాటి చార్జ్ చేయడంతో తీవ్ర గాయాలు అయినాయి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు ఇందులో పాల్గొన్నారు.
వీరిపై దౌర్జన్యంగా వ్యవహరించి లాఠీ చార్జ్ చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులపై జరిగిన ఈ దాడి రాజ్యాంగంపై జరిగిన దాడి అందువల్ల భారత జాతీయ కాంగ్రెస్ ఈ రోజును భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డేగా ప్రకటించింది. అందువల్ల తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.