ఈనెల 22 నుండి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

17-10-2026 | 08:08pm

ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడి...

ఆదిలాబాద్, అక్టోబర్ 17, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ లోని మార్కెట్ యార్డ్‌లో(Market Yard) సీసీఐ, ప్రైవేట్ వ్యాపారుల(CCI, private traders) ద్వారా ఈనెల 22 నుండి పత్తి కొనుగోళ్లు(Cotton purchases) ప్రారంభించడానికి జిల్లా యంత్రాగం నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి(Boranchu Srikanth Reddy) తెలిపారు. పత్తి కొనుగోళ్లలో తేమ శాతం నిర్ధారణపై ఏఎంసీ, సీసీఐ, ఐకేపీ, వీఓఏ సిబ్బందికి శుక్రవారం మార్కెట్ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించగా చైర్మన్ పాల్గొని పలు సూచనలు చేశారు. 

  రైతన్నలకు మార్కెట్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. రైతులు తాము సాగు చేసిన పత్తిని మార్కెట్‌కు తెచ్చే ముందే తేమ శాతంపై సరైన అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు. 

  ఈ కార్యక్రమంలో DMO గజానంద్, సెలెక్షన్ గ్రేడ్ అధికారి విట్టల్, రైతు నాయకులు గోవర్ధన్ యాదవ్, లోకారి పోశెట్టి, లక్ష్మణ్, దత్తార్ధి, రమేష్, సీసీఐ బ్రాంచ్ మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు