కాచాపూర్‌లో బెల్ట్‌ షాపులు తొలగించాలని ఫిర్యాదు

17-10-2026 | 08:15pm

భిక్కనూర్, అక్టోబర్‌ 17 (విజయక్రాంతి): భిక్కనూర్‌ మండలం(Bhikkanur Mandal) కాచాపూర్‌ గ్రామంలో బెల్ట్‌ షాపులను(Belt shops) నిర్మూలించాలని కోరుతూ గ్రామ యువకులు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో(Prohibition and Excise Station) ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న(selling liquor) వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎక్సైజ్‌ అధికారులు సానుకూలంగా స్పందిస్తూ, ప్రభుత్వ అనుమతులు లేని బెల్ట్‌ షాపులపై(Belt shops) తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన కామినేని సంతోష్‌రెడ్డి, మెట్టు సందీప్‌, ముత్యాల నవీన్‌చారి, పూస శంకర్‌, మర్రి మహిపాల్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు