ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం
కుభీర్, అక్టోబర్ 16(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కుభీర్ మండలంలోని సోనారి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపంలో(Goddess Durga Pavilion) నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో(Devotional) కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తితో మొక్కులు సమర్పించారు.
నిర్మల్ జిల్లా ఆర్ఎస్ఎస్ భౌద్ధిక్ ప్రముఖ్ ప్రవీణ్ జీ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజా సామగ్రితో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో సుఖసంతోషాలు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలను విజయవంతం చేశారు.