ప్లాస్టిక్ దుకాణాలపై అధికారులు దాడులు
08-10-2026 | 04:51pm
నిర్మల్ అక్టోబర్ 8 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలో ఉన్న ప్లాస్టిక్ దుకాణాలు, కిరాణా దుకాణాల పై మున్సిపల్ అధికారులు(Municipal officials) దాడులు నిర్వహించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడిన వారికి 7000రూపాయలు జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ రవి బాబు మాట్లాడుతూ దుకాణదారులు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని,
దీనికి బదులుగా బట్ట సంచులు వాడాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని లేనియెడల భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రజిని మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.