ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
27-11-2026 | 04:32pm
నిర్మల్ నవంబర్ 27 ( విజయ క్రాంతి): నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో(Collector's Office) పనిచేస్తున్న ఉద్యోగులకు శుక్రవారం ఉచిత ఆరోగ్య పరీక్షలు(Free health check-ups) నిర్వహించారు. డాక్టర్ సతీష్, శకుంతల ఆధ్వర్యంలో ఉద్యోగులకు ఎత్తు బరువు బిపి రక్త నమూనా ఇతర పరీక్షలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమం వైద్య సిబ్బంది మాధవరావు సురేందర్ శోభ పాల్గొన్నారు.