గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో వాసవి విద్యార్థులు
భైంసా (విజయక్రాంతి) : జిల్లాలోని వాసవి వరల్డ్ స్కూల్ విద్యార్థులు(Vasavi World School students) అంతర్జాతీయ స్థాయిలో(International level) నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్(Guinness World Records) కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించినట్టు పాఠశాల కరస్పాండెంట్స్, సెక్రెటరీ కోదాడ రెడ్డి జగదీశ్ రెడ్డి తెలిపారు. (ఎబెక్ లాంగ్వేజ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్)Ebek Language Laboratories Private Limited (India) ఆధ్వర్యంలో 2026 ఆగస్టు 31న చెన్నై, తమిళనాడులో నిర్వహించిన “(ది లార్జెస్ట్ రీడింగ్ అండ్ లిస్తెనింగ్ కాంపిటీషన్)The Largest Reading and Listening Competition” కార్యక్రమంలో వాసవి వరల్డ్ స్కూల్ విద్యార్థులు అల్లాడి ఆరాధ్య లక్ష్మి (Alladi Aaradhya Lakshmi) మరియు దేవేశ్వర్ అల్లాడి (Deveshwar Alladi) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం Guinness World Records™ టైటిల్లో భాగంగా నిర్వహించబడగా, విద్యార్థులకు అధికారిక పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు తీసుకోవడం జరిగింది అన్నారు. ఈ ప్రిన్సిపాల్ శైల జాయ్ సన్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు