మంథనిలో ఘనంగా సామూహిక వందేమాతరం గీతాలాపన

25-09-2026 | 06:01pm

మంథని, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి) విద్యా భారతి న్యూఢిల్లీ(Vidya Bharati New Delhi) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో (Mass rendition of the Vande Mataram song) భాగంగా మంథనిలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం టెక్నో హైస్కూల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. పాఠశాల కోఆర్డినేటర్ కనుకుంట్ల స్వామీజీ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశభక్తి భావంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పాఠశాల కరస్పాండెంట్  ప్రదీప్ రెడ్డికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రాం కోఆర్డినేటర్ మేడగొని రాజమౌళి గౌడ్ సమన్వయంతో నిర్వహించారు.

మరిన్ని వార్తలు