పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు

24-09-2026 | 06:51pm

ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు

బోధన్,(విజయక్రాంతి): పట్టణంలోని బాబాగార్డెన్ చౌరస్తా వద్ద ఉన్న కట్టమైసమ్మ ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని కట్టమైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెదకాపు సాయిలు, విడిసి అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారీ, కోశాధికారి గామారపేట శ్రీను, మాసుల ప్రసాద్, పెంటయ్య, శ్రీరామ్ సాయిలు, బండారి లింగురం, పోతయ్య, సాయిబాబా, అబ్బులు, బీర్కూర్ అజయ్, కమల శేఖర్ తదితరులతో పాటు మున్నూరు కాపు సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు