బోధన్‌లో కన్నుల పండువగా కుంకుమార్చన

16-10-2026 | 10:11pm

బోధన్, అక్టోబర్ 16(విజయక్రాంతి) : బోధన్​ పట్టణం(Bodhan town)​ రాకాసిపేట్‌లో శ్రీ మార్కండేయ మాతా మండలి(Sri Markandeya Mata Mandali) ఆ​ధ్వర్యంలో శుక్రవారం అమ్మవారి కుంకుమార్చన పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లోక కల్యాణం, సర్వజనుల ఆయురారోగ్యాలు, సుఖశాంతులను కాంక్షిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమం(Puja Ceremony)లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన 108 రకాల విశిష్ట ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి, భక్తులకు(devotees) మహా ప్రసాదంగా పంపిణీ చేశారు. కాలనీవాసులు, మహిళా భక్తులు ఈ వేడుకలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు.

మరిన్ని వార్తలు