ఓట్ బచావో దేశ్ బచావో ర్యాలీలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

01-11-2026 | 11:50pm

ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ

బోధన్, నవంబర్ 01 (విజయక్రాంతి): న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో ఢిల్లీ – ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీలో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి(MLA P Sudarshan Reddy) పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణకు మద్దతుగా నినాదాలు చేశారు.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు ఆరోపణలు, ఎన్నికల ప్రక్రియలో నెలకొన్న అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ నినాదంతో నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ ర్యాలీలో పాల్గొనేందుకు బోధన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.

మరిన్ని వార్తలు