నిజామాబాద్‌లో ఎస్సీ అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్లు
ఉచిత ఎస్ఐ, పీసీ రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
బోధన్, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం(State Government) అందిస్తున్న ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థుల ఉచిత ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ (పీసీ) రెసిడెన్షియల్ శిక్షణకు స్పాట్ అడ్మిషన్లు కల్పించనున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ జి. రజిత, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా. దేవిదాస్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
డిగ్రీ అర్హత కలిగిన ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు నిజామాబాద్‌లోని నామేవాడలో ఉన్న టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు నేరుగా హాజరుకావాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎస్ఐ, పీసీ శిక్షణ రిజిస్ట్రేషన్ ఫారంతో రావాలని సూచించారు.
పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ స్పాట్ అడ్మిషన్ల అవకాశాన్ని వినియోగించుకొని ఉచిత శిక్షణ పొందాలని అధికారులు కోరారు.