మహాసభను విజయవంతం చేయాలి
జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ పిలుపు
బోధన్, నవంబర్ 24 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా TUWJ–IJU మహాసభను(TUWJ–IJU General Conference) విజయవంతం చేయాలని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు (Union District President) ఎడ్ల సంజీవ్ జిల్లాలోని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ఈ నెల 26న గురువారం ఉదయం 10 గంటలకు నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ విజయలక్ష్మి గార్డెన్లో జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, TUWJ–IJU రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ రెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో జర్నలిస్టుల ఐక్యత, వృత్తిపరమైన సమస్యలు, హక్కుల పరిరక్షణ, జర్నలిస్టుల సంక్షేమం వంటి అంశాలపై మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కావున నిజామాబాద్ జిల్లాలోని TUWJ–IJU యూనియన్ సభ్యులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ ఈ మహాసభకు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి టి. అరవింద్ బాలాజీ, జిల్లా కోశాధికారి సిరిగాద ప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు.