అవినీతి రహిత మున్సిపాలిటీగా మంథనికి గుర్తింపు

24-11-2026 | 05:55pm
  1. మంత్రి శ్రీధర్ బాబును విమర్శించే అర్హత పుట్ట మధుకు లేదు
  2. మచ్చలేని నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు..
  3. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం
  4. మంథనిలో విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి 

మంథని, నవంబర్ 24: రాష్ట్రంలో అవినీతి రహిత మున్సిపాలిటీగా మంథనికి ప్రత్యేక గుర్తింపు ఉందని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును విమర్శించే నైతిక అర్హత మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు లేదని మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్(Municipal Chairman Srinivas) తీవ్రంగా విమర్శించారు.  మంథని మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ ముస్కుల సాయేందర్ రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబులను విమర్శించడమే పనిగా పెట్టుకున్న పుట్ట మధు తన వ్యాఖ్యలతో ప్రజల్లో చులకన అవుతున్నారని అన్నారు. వేల కోట్ల రూపాయలతో మంథని ప్రాంత అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు బాటలు వేస్తున్నారని, ఇంతటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. మంథని, కాళేశ్వరం పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులు గతంలో ఎన్నడూ లేని విధంగా వేగంగా జరుగుతుండటాన్ని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో ఎస్టీ, 2021లో ఎస్సీ వసతి గృహాలను అద్దె భవనాల్లో నిర్వహించారని, ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు వాటికి శాశ్వత భవనాలు నిర్మిస్తుంటే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకున్న చరిత్ర, కాంట్రాక్టర్లపై దాడులకు పాల్పడిన చరిత్ర పుట్ట మధుదేనని ఆరోపించారు.

మంథని అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు

వైస్ చైర్మన్ ముస్కుల సాయేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మంథనిని మున్సిపాలిటీగా మార్చి ప్రజలపై పన్నుల భారం పెంచారని, పేదలకు ఉపాధి హామీ పనులు దూరం చేశారని విమర్శించారు. ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంథనిలో నూతన ప్రభుత్వ భవనాలు, నాలుగు వరుసల రహదారుల నిర్మాణం వంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

గ్రామపంచాయతీకి, మున్సిపాలిటీకి మధ్య ఉన్న తేడా కూడా తెలియకుండా పుట్ట మధు మాట్లాడటం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. మున్సిపాలిటీలో అనేక శాఖలు, విభాగాలు పనిచేస్తాయని, వాటి అవసరాలకు అనుగుణంగా నూతన మున్సిపల్ భవన నిర్మాణం చేపడుతున్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పాత కోర్టు స్థలాన్ని ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన నేపథ్యంలో, మంథనిలోని గెస్ట్‌హౌస్‌ను న్యాయమూర్తుల భవన సముదాయానికి కేటాయించిన విషయాన్ని కూడా విమర్శలు చేసే ముందు తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు పెంటరి రాజు, మారుపాక నిహారిక, ఎల్లంకి వంశీధర్, కర్రు లింగయ్య, పార్టీ సీనియర్ నాయకులు లైసెట్టి రాజు, జంబోజు సమ్మయ్య, ఎరుకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు