రాజరాజేశ్వర ఆలయంలో విశేష పూజలు
- భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
- ఆలయ కమిటీ అధ్యక్షులు గందె శ్రీనివాస్ గుప్తా
నల్లబెల్లి, నవంబర్ 24 ( విజయ క్రాంతి ): కార్తీక మాసం, పౌర్ణమి విశిష్టతను పురస్కరించుకుని నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో(Sri Rajarajeswara Swamy Temple) భక్తుల(Devotees ) రద్దీ నెలకొంది. మంగళవారం గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉసిరికాయ దీపాలు వెలిగించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు పెందోట మురళీమోహన్ చారి, అర్చకులు సూర్యం, కరుణాకర్ల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గందె శ్రీనివాస్ గుప్తా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని,
స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త తాటిపల్లి రవీందర్, కమిటీ ఉపాధ్యక్షులు పురాం బద్రీనాథ్, కోశాధికారి మార్త మార్కండేయ, సభ్యులు గంగిశెట్టి నాగభూషణం, గుగ్గిల శ్రీనివాస్, పడాల మురళి, మురికి మనోహర్, దేవులపల్లి శ్రీనివాస్, గుమ్మడి వేణు, తదితరులు పాల్గొన్నారు.