ముత్తారం లో రాజకీయాలకు అతీతంగా బతుకమ్మ మైదానం సిద్ధం
మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్‌రావుకు గ్రామస్తుల కృతజ్ఞతలు
మంథని ప్రతినిధి, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతికి(Telangana Culture) ప్రతీకైన సద్దుల బతుకమ్మ వేడుకల కోసం ముత్తారం కాసర్లగడ్డ–గుండ్లకుంట చెరువు మైదానాన్ని మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్‌రావు(Nagineni Jaganmohan Rao) స్వచ్ఛందంగా ముందుకొచ్చి మొరం పోయించి యుద్ధప్రాతిపదికన చదును చేయించారు. ఆదివారం స్థానిక సర్పంచ్ సుదాటి రవీందర్‌రావుతో కలిసి గ్రామ పెద్దలు, సకల పక్షాల నాయకులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు.
మహిళలకు ఇబ్బందులు కలగకుండా మైదానాన్ని చదును చేయించినందుకు గ్రామ ప్రజలు, పెద్దలు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేలాదిగా తరలివచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తాగునీరు, రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగులు ఏర్పాటు చేయాలని, దారికి అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని కోరారు.
పండుగల నిర్వహణకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అలుగం రాజేశం, మారం నారాయణరెడ్డి, పెయ్యాల కుమార్, తాటిపాముల శంకర్, గాదం శ్రీనివాస్, వెల్మరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కాశీవోజ్జుల వీరాచారి, కాట్ల రాజయ్య, దయ్యాల కొమురయ్య, గుడి కొండల్‌రెడ్డి, అమ్ము వినోద్‌కుమార్, తిర్నహరి రాజు, బొల్నేని బుచ్చంరావు, కలవేన బాలమల్లు, లక్కాకుల రాజేశం, సాగర్, అమ్ము బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.