నారాయణఖేడ్ లో నిజాయతీ చాటుకున్న యువకుడు
18-10-2026 | 06:06pm
నారాయణఖేడ్, అక్టోబర్ 18: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గోల్డ్ మార్కెట్(Narayankhed Gold Market) వద్ద చీకుర్తికి చెందిన పార్వతి పర్సు పోగొట్టుకున్నారు. అందులో సుమారు రెండున్నర తులాల బంగారు నగలు(Gold jewelry) ఉన్నాయి. రేగోడ్ మండలం మర్పల్లికి చెందిన నవీన్ పర్సు దొరకడంతో, నగలను పార్వతికి తిరిగి అప్పగించాడు. నగలు తిరిగి లభించడంతో పార్వతి సంతోషం వ్యక్తం చేసి నవీన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా నవీన్ నిజాయతీని పలువురు అభినందించారు.