రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే కేసులు తప్పవు
ముత్తారం ఎస్ఐ ఎన్. రవికుమార్
ముత్తారం, నవంబర్ 05(విజయ క్రాంతి) :మండలంలోని రోడ్లపై ధాన్యం ఆరబోసి వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ముత్తారం ఎస్ఐ ఎన్. రవికుమార్(Muttaram SI N. Ravikumar) హెచ్చరించారు.
రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా కల్లాలు, సొంత స్థలాలను వినియోగించుకోవాలని సూచించారు. మండలంలోని గ్రామాలలో రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల వాహనాలు జారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే ముప్పు ఉందని తెలిపారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు రైతులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.