అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు

05-11-2026 | 12:39pm

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల కలకలం.. సీఎం రేవంత్‌కు కవిత సవాల్!

హైదరాబాద్‌: నగరంలోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో సుమారు 500 నుంచి 700 వరకు అక్రమ భవనాలు నిర్మించారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నివాసానికి సమీపంలోనే ఇంతటి Illegal Constructions జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సర్వే నంబర్లు 11/18 నుంచి 44 వరకు వరుసగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కవిత ఆరోపించారు. సర్వే నంబర్ 12లో ఏకంగా 12 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం కూడా సుమారు 80 భవనాల Construction పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా అక్రమంగా Building Permissions ఎలా మంజూరు చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ వ్యవహారంపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ తీరును కూడా కవిత ప్రశ్నించారు. ఇంత పెద్ద సంఖ్యలో Unauthorized Constructions జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. అధికారులపై ఎవరి Pressure ఉందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న ఈ వ్యవహారంపై ఇతర Political Parties ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు, అయ్యప్ప సొసైటీలోని అక్రమ భవనాలను Google Maps ద్వారా గుర్తించి ఓ పత్రిక వార్త ప్రచురించిందని కవిత పేర్కొన్నారు. అయితే ఈ వార్తా కథనంపై స్పందించిన కొందరు భవన యజమానులు Media ప్రతినిధులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ వెనుక ప్రభుత్వం ఉందంటూ జర్నలిస్టులను భయపెడుతున్నారని విమర్శించారు. మీడియాపై ఇలాంటి బెదిరింపులు రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. “కాంగ్రెస్ నడుపుతున్నది ప్రభుత్వమా? రౌడీ రాజ్యమా?” అంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే ఉన్న ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు