హెచ్పీవీ టీకాతో గర్భాశయ క్యాన్సర్కు చెక్
జిల్లా ఉప వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సుధీర్
వెంకటాపూర్, నవంబర్ 05 (విజయక్రాంతి): గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(Cervical cancer) నివారణకు హెచ్పీవీ టీకా ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ(Department of Medical and Health) అధికారి డా. సుధీర్ అన్నారు. మండలంలోని జవహర్ నగర్ గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించగా ఈ సందర్భంగా డా. సుధీర్ మాట్లాడుతూ.
మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు హెచ్పీవీ వైరస్ ప్రధాన కారణమని, 14 నుంచి 15 ఏళ్ల వయసులో హెచ్పీవీ టీకా వేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని, బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం తల్లిదండ్రులు ముందుకొచ్చి టీకాలు వేయించాలని కోరారు. అనంతరం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. నాగ అణేష్ మాట్లాడుతూ..
హెచ్పీవీ టీకా ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును 90 శాతానికి పైగా తగ్గించవచ్చని, టీకా సురక్షితమైనదని, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా మాస్ మీడియా అధికారి సంపత్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ దేవి లక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు ఫాతిమా, స్వర్ణలత, రమణమ్మ, మోతీలాల్, ఆశాలు షహీదా తదితరులు పాల్గొన్నారు.