లడ్డూ కేసులో సుప్రీం షాక్.. ఏపీ బయటకు నో ఎంట్రీ!

05-11-2026 | 12:47pm

తిరుమల లడ్డూ కల్తీ కేసులో (Tirumala Laddu Case) సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ వెలుపలకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో విచారణను మరో రాష్ట్రానికి మార్చాలన్న అభ్యర్థనకు చుక్కెదురైంది.

ప్రైవేట్ డెయిరీ సంస్థకు చెందిన ఎండీ మచ్ఛీంద్ర శాంతారామ్ లంకే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో విచారణ కొనసాగితే నిష్పక్షపాత విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలను కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ పిటిషన్‌పై గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం (Supreme Court Bench) విచారణ చేపట్టింది. అయితే కేసును పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయడానికి తగిన కారణాలు లేవని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను తిరస్కరించింది.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు