వ్యాపార రంగం వైపు దృష్టి సారించాలి
మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు
ఉట్నూర్, నవంబర్05( విజయ క్రాంతి ): గిరిజన యువకులు వ్యాపార రంగంలో(Tribal youth in the business sector) స్థిరపడే విధంగా దృష్టి సారించాలని మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవా సమితి(Raj Gond Seva Samiti) రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పేందూరు అంకుష్ ప్రారంభించిన పత్తి కొనుగోలు, సోయా, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ యువకులు ఉన్నత చదువులు చదవడంతో పాటు అన్ని రంగాల్లో రాణించే విధంగా పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. ఆయనతోపాటు రాజ్ గోండు సేవాసమితి జిల్లా నాయకుడు కీలక తులసీరామ్, నాయకులు పాల్గొన్నారు.