మహాచండీ హోమంలో కాంగ్రెస్ మండల అధ్యక్ష దంపతులు
ప్రజల సుఖసంతోషాలు, రైతుల పంటల సమృద్ధి కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు
ముత్తారం, అక్టోబర్ 16(విజయక్రాంతి) : పెద్దపల్లి జిల్లా(Peddapalli District) ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో లీడర్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను(Durga Devi Navaratri celebrations) పురస్కరించుకొని దుర్గామాత మండపంలో నిర్వహించిన మహాచండీ హోమం కార్యక్రమంలో(Maha Chandi Homam Ritual) ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, ఆయన సతీమణి గీతారాణి దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ప్రార్థించారు. రైతులకు పంటలు సమృద్ధిగా పండి, వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం నిండాలని దుర్గామాతను వేడుకున్నట్లు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భవానీ దీక్షాపరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.