వివాహ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఐటీ శాఖ మంత్రి
హుజురాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు(Congress Party President) దొడ్డ బాలాజీ కుమారుని శుభవివాహ వేడుకలు హుజురాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ శుభకార్యానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వధూవరులతో ఆత్మీయంగా ముచ్చటించిన మంత్రి శ్రీధర్ బాబు, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఓడితల ప్రణయ్, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు సూపర్ సదానందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






