భూముల రీ సర్వేలో నిర్లక్ష్యం..

01-11-2026 | 11:46pm

లైసెన్సుడ్ సర్వేయర్ లైసెన్స్ సస్పెన్షన్

ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

గంభీరావు పేట నవంబర్ 01 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో భాగంగా కేటాయించిన విధులు నిర్వర్తించడంలో అలసత్వం ప్రదర్శించిన లైసెన్సుడ్ సర్వేయర్ బాలకృష్ణ లైసెన్స్ ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్(District Collector Garima Agrawal) సస్పెన్షన్ చేశారు.

భూముల రీ సర్వేలో భాగంగా మొదటి దశలో జిల్లాలోని 70 గ్రామాల్లో రీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్లతో పాటు, ప్రభుత్వ ఆమోదం పొందిన లైసెన్సుడ్ సర్వేయర్లు భూముల రీ సర్వే ప్రక్రియలో పాల్గొంటున్నారు.

గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి గ్రామంలో భూముల రీ సర్వే కొనసాగుతుండగా, సర్వే కోసం కేటాయించిన లైసెన్సుడ్ సర్వేయర్ ఎం.బాలకృష్ణ గత కొన్ని రోజుల నుండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భూముల రీ సర్వే ప్రక్రియలో పాల్గొనకుండా, గైర్హాజరు కావడం పట్ల జిల్లా కలెక్టర్ సంబంధిత లైసెన్సుడ్ సర్వేయర్ పై చర్యలు తీసుకున్నారు.

లైసెన్సుడ్ సర్వేయర్ బాలకృష్ణ లైసెన్స్ ను  సస్పెన్షన్ చేస్తూ ఆదివారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో భాగస్వామ్యమైన అధికారులు అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.

మరిన్ని వార్తలు