కేటీఆర్ సహకారంతో మంచినీటి బావి పునరుద్ధరణ

06-11-2026 | 06:17pm

రూ.10 లక్షలతో పునరుద్ధరణ..

ప్రారంభించిన నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు సర్పంచ్ విమల..

గంభీరావుపేట నవంబర్ 6 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట మండలంలోని గజసింగవరం గ్రామంలో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో పునరుద్ధరించిన మంచినీటి బావిని శుక్రవారం నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, గ్రామ సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు బావి పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ బావి అందుబాటులోకి రావడంతో గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి మంచినీటి బావి పునరుద్ధరణకు రూ.10 లక్షల నిధులు సమకూర్చిన కేటీఆర్‌కు సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాపరవేణి భాస్కర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, వార్డు సభ్యులు శంకర్, అంజయ్య, రాములు, దేవయ్య, శ్రీనివాస్, నాయకులు కిష్టయ్య, శిరీష్, రాజేష్, రామచంద్రం, అశోక్, చంద్రమౌళి, వెంకటి, నవీన్ రెడ్డి, సతీష్‌తో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు