షీ టీమ్, భరోసా ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన

06-11-2026 | 07:27pm

భూపాలపల్లి టౌన్, నవంబర్ 06 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం షీ టీమ్(She Teams), భరోసా సంయుక్తంగా మహిళలు, బాలికలు, విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షి టీం ఎస్సై స్వప్న కుమారి మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.

మహిళలపై జరిగే వేధింపులు, వాటిని ఎదుర్కొనే విధానం, షీ టీమ్ సేవలు, మహిళల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, టీ సేఫ్ యాప్ వినియోగం, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, అత్యవసర పోలీస్ సేవలు 112 గురించి వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

మరిన్ని వార్తలు