కుంకుమ పూజతో ఆధ్యాత్మిక సందడి

20-09-2026 | 05:03pm

శ్రీనగర్ కాలనీ సీతారాం మండప్ లో కుంకుమ పూజ మహా అన్నదానం

రాజన్న సిరిసిల్ల 20 సెప్టెంబర్  (విజయక్రాంతి): శ్రీనగర్ కాలనీలోని సీతారాం మండప్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ(Kumkuma Puja) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీనగర్ కాలనీ వాసులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.

మరిన్ని వార్తలు