ఆకట్టుకున్న కిసాన్ మేళా..
80,000 అంటుకట్టిన టమాటా మొక్కల పంపిణీ
హార్ట్ఫుల్నెస్ సంస్థ బృహత్తర కార్యక్రమం
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేసేందుకు హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్(Heartfulness Institute), రంగారెడ్డి జిల్లా ఉద్యానవన మరియు ప ట్టు పరిశ్రమల శాఖ సంయుక్తంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఇబ్రహీంపట్నం మండలం(Ibrahimpatnam Mandal) కొంగరకలాన్‌లోని ఇంటిగ్రేటెడ్ డి స్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ లో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా ’కిసాన్ మేళా’లో రైతులకు ఉచి తంగా 80,000 చేతితో అంటుకట్టిన (గ్రాఫ్టెడ్) టమాటా మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి కొప్పి శెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కూరగాయల సాగు పెంచడమే లక్ష్యం
రాష్ట్రంలో గత దశాబ్దంలో కూరగాయల సాగు విస్తీర్ణం 5.5 లక్షల ఎకరాల నుండి 1 లక్ష ఎకరానికి పడిపోవడంతో, ఈ కొరతను అధిగమించడానికి శాస్త్రీయ అంటుకట్టు సాంకేతికతను ప్రోత్సహిస్తున్నారు.కన్హా శాం తి వనంలోని క్లైమేట్-కంట్రోల్ నర్సరీలో దా దాపు రెండు నెలల పాటు పెంచిన ఈ గ్రాఫ్టె డ్ మొక్కల వల్ల వాడిపోవడం, నెమటోడ్ వంటి తెగుళ్ల నిరోధకత పెరుగుతుంది. ఇవి ఎకరానికి 15% నుండి 40% వరకు అదన పు దిగుబడిని అందిస్తాయి.ప్రభుత్వ సంస్థ లు, క్షేత్రస్థాయి స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే రైతుల జీవనోపాధి, నేల ఆరోగ్యం, వా తావరణ మార్పులను తట్టుకునే శక్తి పెరుగుతుందని హార్ట్ఫుల్నెస్ హెచ్ఓడీ శివశరవణన్ ఆర్ముగం పేర్కొన్నారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ న్ చిలుక మధుసూదన్ రెడ్డి, జిల్లా వ్యవసా య అధికారులు సుజాత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.