మట్టి వినాయకుల పంపిణీకి శ్రీకారం

11-09-2026 | 02:11pm

ఆదిభట్ల సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ఇంజాపూర్ వార్డు కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకులు   బొక్కగౌతంరెడ్డి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు


మరిన్ని వార్తలు