ఎల్‌నినో ఎఫెక్ట్‌పై విద్యార్థులకు అవగాహన

02-11-2026 | 12:11pm

మూసాపేట్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మూసాపేటలోని కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాలలో ఎల్‌నినో (El Niño) ప్రభావాలు, వాటి కారణంగా కలిగే వాతావరణ మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన (Awareness) కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గురుకుల, మోడల్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలు, కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో వచ్చే సోమవారం నుంచి ఉదయం ప్రార్థనా సమయంలో (Morning Assembly) ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) కూడా పాల్గొననున్నారు. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. అవగాహన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపించాలని విద్యాశాఖ అధికారులు కోరారు.

మరిన్ని వార్తలు