బట్లోని బావి కుంట బౌండరీపై వివాదం!
- కుంట్లూరులోని చెరువులు, కుంటలపై హైడ్రా ఫోకస్
- సర్వే నంబర్ 24లో 84.21 ఎకరాల విస్తీర్ణం
- మ్యాప్ ప్రకారం సర్వే జరగలేదని స్థానికుల ఆరోపణ
- పెద్దోళ్లకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా?
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District), అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణపై హైడ్రా(HYDRA) దృష్టి సారించడంతో భూహద్దుల వివాదాలు(Land boundary disputes) మ రోసారి తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా బట్లోని బావి కుంట బౌండరీ విషయంలో నెలకొన్న వివాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కుంటల అసలు విస్తీర్ణం, సరిహద్దుల నిర్ధారణ, క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వే తీరుపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుంట్లూరు సర్వే నంబర్ 24లో మొత్తం 84.21 ఎకరాల విస్తీర్ణం రికార్డులలో ఉంది. ఈ సర్వే నంబర్లోని భూములు, కుంటల హద్దులను అధికారిక రికార్డులు, పాత మ్యాప్ల ఆధారంగా సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
మ్యాప్ ప్రకారం సర్వే జరిగిందా?
కుంటల సరిహద్దుల నిర్ధారణలో పాత రెవెన్యూ రికార్డులు, హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్ అధికారుల(Irrigation officials) సర్వే మ్యాప్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే బట్లోని బావి కుంట విష యంలో మ్యాప్ ప్రకారం సర్వే జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కొలతలు, రికార్డుల్లోని వివరాలు సరిపోలుతున్నాయా? కుంటకు సంబంధించిన అస లు హద్దులను పరిగణనలోకి తీసుకున్నా రా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
24 సర్వే నెంబర్‌లో ఉండే బట్లోనిబావి కుంటకు 1.09 ఎకరాలను మాత్రమే ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఫెన్సింగ్ వేసింది బట్లోని బావి కుంటకా, ప్రభుత్వ భూమికా అనే విషయంపై స్పష్టత లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.
పెద్దోళ్లకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా?
కుంటల పరిరక్షణ విషయం లో అధికారులు అందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. సామాన్యుల భూముల విషయంలో అధికారులు వేగంగా స్పందిస్తున్నప్పుడు, రాజకీయ నాయకులు, బడాబాబులకు సం బంధించిన భూముల విషయంలోనూ అదే పారదర్శకత కనిపించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎవరైనా ని బంధనలు ఉల్లంఘించినట్లు తేలితే, ఆధారా ల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
హైడ్రా చర్యలపై ఆశలు..
చెరువులు, కుంటల ఆక్రమణలను అరికట్టడం, వాటి అసలు విస్తీర్ణాన్ని కాపాడటం లక్ష్యంగా హైడ్రా చేపడుతున్న చర్యల నేపథ్యంలో బట్లోని బావి కుంట వివాదానికి కూడా పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. సర్వే నంబర్ 24కు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, పాత మ్యాప్లు, ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులను సమన్వయంతో పరిశీలించి హద్దులను స్పష్టంగా నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. బట్లోని బావి కుంట బౌండరీ వివాదంపై సంబంధిత అధికారులు స్పందించి, సర్వే వివరాలను బహిర్గతం చేస్తాయా? ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను తేలుస్తాయా? అన్నది వేచి చూడాలి.