బార్ల లైసెన్సులపై భారీ మోజు!

16-10-2026 | 05:20am

నేడు లాటరీ ద్వారా కేటాయింపు

రంగారెడ్డి డివిజన్ పరిధిలోని నాలుగు బార్లకు 1,006దరఖాస్తులు

అత్యధికంగా మొయినాబాద్ మున్సిపాలిటీలో 664 అప్లికేషన్లు

చేవెళ్లలో ఒక్క బార్‌కు 279, పరిగి, కొడంగల్ లోనూ పోటాపోటీ

లాటరీ హాల్లోకి కఠిన నిబంధనలు.. మొబైల్ ఫోన్లపై నిషేధం

రంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో నూతన బార్ల కేటాయింపు ప్రక్రియ రికార్డు స్థాయి దరఖాస్తులతో రసవత్తరంగా మారింది. ఫ్యూచ ర్ సిటీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో కొత్త బార్ల లైసెన్సుల(New Bar Licenses) కోసం మద్యం వ్యాపారులు, ఆశావహులు భారీ గా పోటీ పడ్డారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 12 వరకు స్వీకరించిన దరఖాస్తుల గడువు ముగియడంతో, అక్టోబర్ 16న (రేపు) నిర్వహించనున్న లాటరీ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మొయినాబాద్‌లో రికార్డు స్థాయి పోటీ..

రంగారెడ్డి డివిజన్ పరిధిలోని నాలుగు బార్లకు మొత్తం 1,006 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇ ందులో కేవలం చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల పరిధిలోని మూడు బార్ల కోసమే ఏకంగా 943 అప్లికేషన్లు దా ఖలయ్యాయి. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఒక్క బార్‌కు 279 దరఖాస్తులు రాగా...మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రెండు బార్ల కోసం 664 దరఖాస్తులు అందాయి. మొ యినాబాద్లో ఒక్కో బార్‌కు సగటున 332 దరఖాస్తు లు రావడంతో ఇక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కొడంగల్, పరిగిలోనూ జోరు..

మరోవైపు వికారాబాద్ డివిజన్ పరిధిలోని మున్సిపాలిటీల్లోనూ బార్ల కోసం గట్టి పోటీ నడిచింది. కొడంగల్, పరిగి మున్సిపాలిటీల్లోని రెండు బార్లకు కలిపి మొత్తం 63 దరఖాస్తులు వచ్చాయి. కొడంగల్ మున్సిపాలిటీలో ఒక బార్‌కు 27, పరిగి మున్సిపాలిటీలో ఒక బార్‌కు 36 అప్లికేషన్లు అందాయి. వికారాబాద్ డివిజన్ బార్లకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టరేట్లో నిర్వహించనున్నారు.

అక్టోబర్ 16న లాటరీ కేటాయింపు..

రంగారెడ్డి డివిజన్ పరిధిలోని బార్ల కేటాయింపు ప్రక్రియను అక్టోబర్ 16న ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్ గ్రామంలో ఉన్న పీవీ కన్వెన్షన్ హాల్ (వీజేఐటీ కళాశాల) లాటరీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఎంట్రీ పాస్ ఉన్నవారిని మాత్రమే హాల్లోకి అనుమతిస్తారు.

అభ్యర్థుల తరఫున ప్రతినిధులు హాజరైతే, సంబంధిత అభ్యర్థి నుంచి జారీ చేసిన అధికారిక అనుమతి పత్రం తప్పనిసరిగా సమర్పించాలి. లాటరీ ప్రక్రియ సమయంలోహాల్లోకి ఎలాంటి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.లాటరీ టెండర్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే 8712658729 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. మరికొన్ని గంటల్లో లాటరీ డ్రా ద్వారా బార్లు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరవుతారనేది తేలనుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.

మరిన్ని వార్తలు