పిగ్లీపూర్‌కు కొత్త వెలుగులు.. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

31-10-2026 | 02:45pm

అబ్దుల్లాపూర్‌మెట్‌, అక్టోబర్ 31 (విజయక్రాంతి): మండల పరిధిలోని పిగ్లీపూర్‌ గ్రామంలో విద్యుత్‌ సరఫరాను మెరుగుపరిచేందుకు 100 కేవీ సామర్థ్యం గల నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ (100 KVA Transformer) ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ (Power Supply) ద్వారా గ్రామానికి విద్యుత్‌ సరఫరా చేయనున్నారు.

గతంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా వ్యవసాయ బావులు, బోర్లకు మాత్రమే విద్యుత్‌ సరఫరా కొనసాగేది. ప్రస్తుతం గ్రామ విద్యుత్‌ అవసరాల కోసం ప్రత్యేకంగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులకు మెరుగైన విద్యుత్‌ సరఫరా అందనుంది (Electricity Supply).

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కోట ప్రభాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ దుర్గం నరసింహ యాదవ్‌, వార్డు సభ్యులు జక్కుల శివకుమార్‌, జక్కుల ఝాన్సీ, ఆంజనేయులు, వర్ధన్‌ లావణ్య, హనుమంతు, జక్కుల పరమేష్‌, పంది మురళీకృష్ణ, కొండ రమేష్‌, కొలను హరిణి, మహేందర్‌రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు